Breaking News

పుట్టినరోజు మరునాడే వివాహిత మృతి.. భర్తే చంపేశాడంటున్న బంధువులు


పుట్టినరోజు వేడుకలు చేసుకుని 24 గంటలు కూడా గడవక ముందే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వెలుగుచూసింది. వన్‌టౌన్ పీఎస్ పరిధిలోని రంగా బజార్‌కు చెందిన వివాహిత కొలపర్తి మాణిక్యం (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సీఐ ఎ.కాళీకృష్ణభగవాన్‌ తెలిపారు. ఉండి మండలం కోలమూరుకు చెందిన మాణిక్యంకు నాలుగేళ్ల కిందట పట్టణంలోని వెంకట నారాయణతో వివాహమైంది. Also Read: మంగళవారం కుటుంబంతో కలిసి ఆమె పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. అయితే బుధవారం మధ్యాహ్నం తన భార్య భవనం పైనుంచి పడిపోయినట్లు నారాయణ అత్తింటి వారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో వారంతా హుటాహుటిన అక్కడికి చేరుకుని విగతజీవిగా పడివున్న మాణిక్యాన్ని చూసి విలపించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. Also Read: అదనపు కట్నం కోసం తమ కూతురిని అల్లుడు కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని, అతడే చంపేసి చనిపోయినట్లు నాటకమాడుతున్నాడని మాణిక్యం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే భార్యభర్తలిద్దరికీ పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ఇప్పించామని, ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తెను పొట్టన పెట్టుకున్న నారాయణను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. Also Read:


By January 09, 2020 at 09:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-suspected-death-in-bhimavaram-west-godavari/articleshow/73165885.cms

No comments