Breaking News

ముంబయి: ఫార్మా కంపెనీలో పేలుడు.. ఆరుగురు మృతి


కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఆరుగురు మృతి చెందిన ఘటన మహారాష్ట్రలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లా బొయసర్‌లో సమీపంలోని రసాయన పరిశ్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలోని కోల్వాడ గ్రామం వద్ద మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ()లోని అనక్ ఫార్మాస్యూటికల్స్‌లో రియాక్టర్ పేలినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్లాంట్ ఇంకా నిర్మాణ దశలో ఉన్నట్టు పేర్కొన్నారు. రసాయనాలను పరిశీలిస్తుండగా రాత్రి 7.30 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుసుకోవడంతో శబ్దాలు 15 కిలోమీటర్ల వరకు వినిపించాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్ల కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉండగా పేలుడు తర్వాత నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ భవనం కుప్పకూలిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం వరకూ ఇవి కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారు. ఒకరి ఆచూకీ గల్లంతయినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి, క్షతగాత్రులకు సరైన చికిత్స అందజేయాలని సూచించారు. మృతి చెందినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యలను తాను స్వయంగా పరిశీలిస్తానని సీఎం ఉద్ధవ్ పేర్కొన్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయం కోరినట్టు తెలిపారు.


By January 12, 2020 at 09:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/six-dead-in-explosion-at-under-construction-chemical-factory-in-maharashtra/articleshow/73210306.cms

No comments