Breaking News

విషం కలిపిన పాలు తాగి.. ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య


ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. రాజగంగ్‌పూర్‌ గ్రామంలోని ఐటీ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం మరింత విషాదాన్ని నింపింది. గ్రామంలోని ఐటీ కాలనీకి చెందిన ప్రమోద్‌ రౌత్‌ అనే వ్యక్తి ఇంట్లో రంజిత్‌ ప్రసాద్‌(28), భార్య కల్పన(25), కుమార్తె చిను(3), 18 నెలల బాలుడితో కలసి నాలుగు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. శనివారం ఉదయం వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని కిటికీలోంచి చూడగా ఇంట్లో నలుగురూ విగతజీవులుగా పడి ఉన్నారు. Also Read: దీంతో ఆయన స్థానికులతో కలసి పోలీసులకు సమాచారం అందించాడు. కాసేపటికే అక్కడికి చేరుకున్న పోలీసులు మేజిస్ట్రేట్‌ సమక్షంలో తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. నలుగురు విగతజీవులుగా పడి ఉండటం, పక్కనే పాలగిన్నె ఉండటంతో అందులో విషం కలుపుకుని చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: బీహార్ రాష్ట్రానికి చెందిన రంజిత్‌ రాజగంగ్‌పూర్‌‌లోని డాల్మియా మెటాలిక్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. కల్పన అనే యువతిని ఐదేళ్ల కిందట ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక కలహాలు మొదలయ్యాయి. ఓ వైపు విబేధాలు, మరోవైపు అండగా నిలిచే పెద్దలు లేకపోవడంతో వారు కుంగిపోయారు. ఆ మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read:


By January 12, 2020 at 08:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/couple-commits-suicide-with-two-childrens-in-odisha/articleshow/73210103.cms

No comments