పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ వేధింపులు.. యువకుడిపై నిర్భయ కేసు
రాంగ్ కాల్‌తో ఏర్పడిన పరిచయంతో మాటలు కలిపాడు. ప్రేమ పేరిట వేధింపులకు గురిచేశాడు. తనకిష్టం లేదని యువతి చెప్పడంతో బెంగళూరు నుంచి చేరుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read: కూకట్‌పల్లిలోని గాజుల రామారం ప్రాంతానికి చెందిన ఓ యువతి (22) జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆమెకు బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి ప్రశాంత్ (24)తో సెల్‌ఫోన్లో పరిచయం ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన అతను తనను కలవాలని.. లేదంటే ఆఫీసుకు వచ్చి గొడవ పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె ఓ పార్కులో అతడిని కలిసేందుకు వెళ్లింది. అక్కడ తనను పెళ్లి చేసుకోవాలంటూ ప్రశాంత్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. Also Read: ఈ నెల పదో తేదీన జూబ్లీహిల్స్‌లోని యువతి కార్యాలయానికి వెళ్లిన ప్రశాంత్ కొలీగ్స్ ముందే ఆమెను మరోసారి బెదిరించాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By January 12, 2020 at 09:29AM
No comments