భర్త కళ్లుగప్పి ఆరేళ్లుగా అక్రమ సంబంధం.. నిజం బయటపడటంతో ప్రియుడితో కలిసి
ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో ఇల్లాలు. భర్త, ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న కాపురాన్ని కాదనుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు ఓ అమాయకుడి ప్రాణం తీసింది. పాపం పండటంతో ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతోంది. జిల్లా టేక్మాల్ మండలంలోని సాలోజిపల్లిలో ఈ ఘటన జరిగింది. Also Read: టేక్మాల్ మండలంలోని సాలోజిపల్లి గ్రామానికి చెందిన వేముల సాయిలు (38) భార్య నాగమణితో కలిసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. అయితే నాగమణి ఆరేళ్లుగా భర్త కళ్లుగప్పి అదే గ్రామానికి చెందిన యాదయ్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సాయిలు పద్ధతి మార్చుకోవాలని భార్యను ఎన్నోసార్లు హెచ్చరించాడు. దీనిపై ఇటీవల దంపతుల మధ్య తీవ్రస్థాయిలో విబేధాలు తలెత్తాయి. దీంతో భర్త తన సుఖానికి అడ్డొస్తున్నాడని నాగమణి కక్ష పెంచుకుంది. ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది. Also Read: ఈ నెల ఏడో తేదీన మద్యం తాగుదామంటూ యాదయ్య.. ప్రియురాలి భర్త సాయిలును పిలిచాడు. ఇద్దరూ టేక్మాల్ శివారులోని చెరువు వద్దకు వెళ్లి మద్యం సేవించారు. ప్లాన్ ప్రకారం యాదయ్య... సాయిలుకు అతిగా మద్యం తాగించాడు. ఆ తర్వాత తన స్నేహితుడు బొడ్డు సురేశ్‌ను అక్కడికి రప్పించి ఇద్దరూ కలిసి సాయిలు తలపై కర్రతో బలంగా కొట్టి చంపేశారు. 8వ తేదీ ఉదయం సాయిలు చెరువు గట్టుపై చనిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సాయిలు భార్య నాగమణిని ప్రశ్నించగా భయంతో హత్య పథకం బయటపెట్టింది. దీంతో ఈ కేసులో వడ్డె యాదయ్య(ఏ1), సురేష్(ఏ2), నాగమణి(ఏ3)ని అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకు తరలించారు. విచారణలో చాకచక్యంగా వ్యవహరించి ఒక్కరోజులోనే చేధించిన సిబ్బందిని అరెస్ట్ చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. Also Read:
By January 10, 2020 at 10:51AM
No comments