Anil Ravipudi లిస్ట్‌లో మెగాస్టార్, యంగ్ టైగర్
‘f2’ సినిమాతో సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న దర్శకుడని నిరూపించుకున్నారు . తన ఐదేళ్ల కెరీర్‌లోనే వెంకటేష్ లాంటి స్టార్ హీరో పక్కన వరుణ్ తేజ్‌లాంటి కుర్ర హీరోను పెట్టి బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్‌ను తెరకెక్కించారు. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాను తీశారు. సంక్రాంతి సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తనలో ఎప్పటినుంచో ఉందని అనిల్ తెలిపారు. టీజర్, ట్రైలర్ చూస్తుంటేనే ఆయన కాన్ఫిడెన్స్ లెవల్స్ ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థమవుతోంది. ఈ విషయం పక్కనబెడితే.. అనిల్ తర్వాతి ప్లాన్స్ ఏంటి అన్న ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్. మహేష్ తర్వాత అనిల్ లిస్ట్‌లో ఏ హీరో ఉన్నాడో అని తెగ ఆలోచించేస్తున్నారు. ఈ విషయంపై అనిల్ ఓ సందర్భంలో స్పందిస్తూ.. తనకు అందరితోనూ పనిచేయాలని, సినీ ఇండస్ట్రీని మొత్తాన్ని రౌండప్ చేయాలని ఉందని తెలిపారు. అయితే మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ కోసం కథలు సిద్ధం చేస్తానని శుభవార్త చెప్పారు. READ ALSO: చిరంజీవి ఒప్పుకుంటే మూడు నెలల్లోనే స్క్రిప్ట్ సిద్ధం చేస్తానని అన్నారు. అంతేకాదు త్వరలోనే తనకు దర్శకుడిగా లైఫ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో ఎన్టీఆర్ హీరోగా సినిమా చేస్తానంటున్నారు. ఈ ఐదేళ్లలో తనను విజయం సాధించేలా చేసినవారు కళ్యాణ్ రామ్, సాయి తేజ్, వెంకటేష్, వరుణ్ తేజ్ అని చెప్తున్నారు. ఏదేమైనా కూడా సరిలేరు నీకెవ్వరు కానీ విజయం సాధిస్తే మాత్రం అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ అయిపోవడం ఖాయం. READ ALSO:
By January 10, 2020 at 10:46AM
No comments