Breaking News

Iran US War టెహ్రాన్‌లో కూలిన ఉక్రెయిన్ విమానం.. ఇరాన్ క్షిపణుల పనే!


ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడిన రోజే ఉక్రెయిన్ విమానం టెహ్రాన్‌లో కూలిపోయిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు జరిగితే, అది జరిగిన కొద్ది గంటల్లోనే ఉక్రెయిన్ విమానం కూలిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, ఇరాన్ క్షిపణులే ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేసినట్టు , బ్రిటన్ అధినేతలు గురువారం వెల్లడించారు. ఉక్రెయిన్ విమానం కూలిపోయిన ఘటనలో 176 మంది ప్రాణాలు కోల్పోయారు. పొరపాటున ఇరాన్ క్షిపణులే కూల్చివేసి ఉంటాయని వారు పేర్కొన్నారు. రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఉక్రెయిన్ విమానాన్ని శత్రువుల యుద్ధ విమానంగా భావించి కూల్చేశారని అమెరికాకు చెందిన నలుగురు అధికారులు వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ విమాన ప్రమాదంలో 63 మంది కెనడా పౌరులు చనిపోయినట్టు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. వివిధ వర్గాల నుంచి నిఘా వ్యవస్థలు సేకరించిన సమాచారం ప్రకారం.. ఇరాన్ క్షిపణి వల్లే విమానం కూలిపోయిందని, దీనికి ఆధారాలు ఉన్నాయని ట్రూడ్ స్పష్టం చేశారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఇలాంటి ప్రకటనే చేయడం గమనార్హం. ఈ సంఘటన పొరపాటున జరిగిందని, ఉద్దేశపూర్వకంగా ఉక్రెయిన్ విమానాన్ని కూల్చేయలేదని అన్ని నిఘా వర్గాలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆస్ట్రేలియా ప్రధాని అన్నారు. ఇరాన్- అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ప్రమాదానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రమాదం ఇరాన్, అమెరికాలు ఆచితూచి స్పందించాయి. ఇదే సమయంలో పశ్చిమాసియాలో పరిస్థితులు కొంత చక్కబడి ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఉక్రెయిన్ విమానాన్ని ఇరాన్ క్షిపణులే కూల్చేశాయని నమ్ముతున్నట్టు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. పొరపాటున ఇది జరిగుండొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ముందుకెళ్లకుండా అమెరికా కాంగ్రెస్ గురువారం రాత్రి కీలక తీర్మానం చేసింది.


By January 10, 2020 at 10:25AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/canada-austrailian-pms-declared-iranian-missile-shot-down-ukrainian-plane/articleshow/73182660.cms

No comments