Breaking News

మహిళల వేషాలేసుకుని దారిదోపిడీలు.. నెల్లూరులో ఘరానా గ్యాంగ్ అరెస్ట్


మహిళలుగా వేషాలేసుకుని రోడ్డుపై వెళ్లే వాహనదారులను ఆపి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిన నుంచి రూ.55,150 నగదు, విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నాయుడుపేటలోని ఆకుతోట వీధికి చెందిన వెంకటగిరి శ్రీరామ్‌, అమావాస్య వెంకటరమణ, వెంకటగిరి రాజా, కంప వెంకటేశ్వర్లు, కిల్లా అల్లెయ్య, నెమళ్లపూడి వెంకటేశ్వర్లు జల్సాలకు అలవాటు పడ్డారు. దీంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు దోపిడీలు చేయాలని నిర్ణయించుకున్నారు. Also Read: పథకంలో భాగంగా వీరిలో కొందరు రాత్రివేళ మహిళల వేషాలేసుకుని లిఫ్ట్ ఇవ్వాలంటూ వాహనదారులను ఆపేవారు. వారిని నమ్మి బైక్ ఆపగానే మిగిలిన గ్యాంగ్ అంతా వచ్చి వాహనదారులను బెదిరించి డబ్బులు, సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలు దోచుకునేవారు. ఇలాగే ఆదివారం తుమ్మూరు సమీపంలో జామాయిల్‌ చెట్లలో వీరంతా మకాం వేశారు. మహిళ రూపంలో ఉన్న వ్యక్తి రహదారిపైకి వచ్చి బెంగళూరు నుంచి వేరే ప్రాంతానికి బైక్‌పై వెళ్తున్న వాహనదారుడిని ఆపాడు. Also Read: అతడిని బలవంతంగా జామాయిల్ తోటలోకి లాక్కెళ్లి రూ.10,150 నగదు దోచుకున్నారు. ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించి వదిలేశారు. బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ జి.వేణుగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై డి.వెంకటేశ్వరావు సిబ్బందితో కలిసి నిఘా పెట్టారు. మంగళవారం శ్రీనివాసపురం సమీపంలో ఉన్న ఆరుగురు దోపిడీ దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:


By January 15, 2020 at 11:21AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/6-members-of-theft-gang-arrested-in-naidupeta-nellore-district/articleshow/73265242.cms

No comments