Breaking News

హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి.. జర్మనీలో గుంటూరు విద్యార్థి సూసైడ్‌


ఉన్నత విద్యను అభ్యసించేందుకు తెలుగు విద్యార్థి ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్నో ఆశలతో కొడుకును విదేశాలకు పంపిన ఆ తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చాడు. రైతు కుటుంబానికి చెందిన జిల్లా ముప్పాళ్లకు చెందిన మోహనరెడ్డిది(23) ఎంఎస్ చదివేందుకు 2017లో జర్మనీకి వెళ్లాడు. అక్కడ డస్‌బర్గ్-ఈస్సెన్ యూనివర్శిటీలో చేరాడు. Also Read: సెమిస్టర్లలో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో అతడిలో ఆందోళన మొదలైంది. కొద్దిరోజుల్లో కోర్సు పూర్తి కావొస్తుండటంతో బ్యాక్‌లాగ్స్ పూర్తిచేయగలనో లేదోనని ఆందోళన చెందుతున్నాడు. నాలుగు రోజుల కింద తండ్రి గోవిందరెడ్డికి ఫోన్ చేసి ఇదే విషయం చెప్పాడు. సరిగ్గా చదవలేకపోతున్నానని, పాసవుతానో? లేదోనని బాధపడ్డాడు. Also Read: అయితే ఆందోళన చెందొద్దని, మనసు ప్రశాంతంగా చేసుకుని పరీక్షలు రాయాలని తండ్రి మోహనరెడ్డికి సూచించాడు. అయితే బుధవారం తాను ఉంటున్న హాస్టల్‌ బిల్డింగ్‌పై నుంచే అతడు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని యూనివర్శిటీ అధికారులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. ఉన్నత చదువులు చదివి చేతికి అందొస్తాడని అనుకుంటున్న తరుణంలో మోహన్‌రెడ్డి పరాయి దేశంలో ఆత్మహత్యకు పాల్పడటాన్ని కుటుంబసభ్యులు తట్టుకోలేకపోతున్నారు. Also Read:


By January 31, 2020 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/guntur-student-commits-suicide-in-germany/articleshow/73793301.cms

No comments