Breaking News

మహిళా డ్యాన్సర్‌పై అఘాయిత్యం.. లిస్బన్ పబ్‌ యజమానిపై నిర్భయ కేసు


నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన బేగంపేటలోని లిస్బన్ పబ్‌ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఓ డ్యాన్సర్‌పై అసభ్యకరంగా ప్రవర్తించిన పబ్ యజమానిపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నిర్భయ కేసు నమోదైంది. Also Read: వివరాల్లోకి వెళ్లే.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ డ్యాన్సర్(23) మెహిదీపట్నం నానల్‌నగర్‌లో నివసిస్తోంది. ఆమె తరుచూ లిస్బన్ పబ్‌కు వెళ్తుంటుంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి పబ్‌కు వెళ్లిన ఆమెను యజమాని మురళీకృష్ణ లోనికి అనుమతించలేదు. తన గదిలోకి రావాలంటూ ఒత్తిడి తెచ్చాడు. తాను చెప్పినట్లు వింటేనే పబ్ లోపలికి అనుమతిస్తానని, లేదంటే వెళ్లిపోవావంటూ లైంగికంగా వేధించాడు. Also Read: దీంతో బాధితురాలు అక్కడి నుంచి నేరుగా పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మురళీకృష్ణపై ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులు ఆయనపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇటీవల లిస్బన్ పబ్‌ తరుచూ వార్తల్లో నిలుస్తోంది. కొద్దిరోజుల క్రితం లిస్బన్‌ పబ్‌లో జరుగుతున్న బాగోతాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. పబ్‌కు ఒంటరిగా వచ్చే యువకుల నుంచి డబ్బులు తీసుకుని అమ్మాయిలను సరఫరా చేయడం, కొందరితో వ్యభిచారం చేయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అక్కడ తనిఖీలు చేసి భారీ సంఖ్యలో యువతులను అదుపులోకి తీసుకున్నారు. Also Read:


By January 30, 2020 at 08:42AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rape-attempt-on-lady-dancer-police-booked-case-against-lisbon-pub-owner/articleshow/73754883.cms

No comments