Breaking News

భార్యతో అక్రమ సంబంధం.. పీకలదాకా మద్యం తాగించి..


తన భార్యతో కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిపై హత్యాయత్నం చేశారు. పీకలదాకా మద్యం తాగించి పథకం ప్రకారం ఓ యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటన సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శేఖర్‌ తెలిపిన వివరాల మేరకు.. యూసుఫ్‌గూడ, జవహర్‌నగర్‌కు చెందిన సదయ్య కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే హన్మకొండకు చెందిన అతడి దూరపు బంధువు రాంబాబు గత కొంతకాలంగా తన భార్యతో వివాహేతర సంబంధం నడుతున్నట్లు సదయ్య అనుమానం పెంచుకున్నాడు. Also Read: ఈ నేపథ్యంలో రాంబాబు, తన భార్యను ఇద్దరినీ సదయ్య పలుమార్లు హెచ్చరించాడు. అయినా వీరి వైఖరిలో మార్పు రాకపోవడంతో రాంబాబును అంతమొందించాలని సదయ్య ప్రణాళికలు రచించాడు. ఇందులో భాగంగా శనివారం రాంబాబుకు ఫోన్‌ చేసి సంక్రాంతి పండుగ సందర్భంగా విందు ఇస్తానని చెప్పడంతో రాంబాబు వచ్చి సదయ్యకు ఫోన్‌ చేశాడు. ఇద్దరూ కలిసి సమీపంలో ఉంటున్న సదయ్య బావ స్వామి ఇంటికి వెళ్లగా ముగ్గురు కలిసి మద్యం తాగారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం రాంబాబుకు బలవంతంగా ఎక్కువ మద్యం తాపించాడు. అనంతరం పథకం ప్రకారం సదయ్య తన వెంట తెచ్చుకున్న కత్తితో మత్తులో జోతుతున్న రాంబాబు గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ రాంబాబును స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు సదయ్య, అతడి బావ స్వామిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Also Read:


By January 14, 2020 at 11:57AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-man-attempt-to-murder-due-to-extramarital-affair/articleshow/73240638.cms

No comments