Breaking News

సికింద్రాబాద్‌లో బాలిక దారుణహత్య, అత్యాచారంపై అనుమానాలు


సికింద్రాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వారాసిగూడలో 17 ఏళ్ల బాలిక దారుణహత్యకు గురైంది. రెండు అపార్ట్‌మెంట్ల మధ్య పడివున్న బాలికను గుర్తించిన స్థానికులు చిలకలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలిక నివాసం ఉంటున్న భవనంపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్‌ టీం ఆధారాలు సేకరిస్తోంది. Also Read: బాలికను ఆమె నివాసమంటున్న అపార్ట్‌మెంట్ పైనుంచే కిందికి తోసేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డాగ్ స్వ్కాడ్‌ సాయంతో పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిందితుల కోసం గాలించారు. దీంతో పాటు సంఘటనా స్థలంలో ఉన్న సీసీ కెమెరా పుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ కేసును అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగిందా? అన్నా కోణంలోనూ విచారిస్తున్నారు. Also Read: ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక చదువుకునేందుకు నిన్న సాయంత్రం భవనం పైకి వెళ్లింది. ఎంతసేపటికి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం చుట్టుపక్కల వెతికారు. ఈరోజు ఉదయం అపార్ట్‌మెంట్ పక్కనే ఆమెను విగతజీవిగా గుర్తించారు. అయితే ఈ ఘటన ప్రేమోన్మాదంగా తెలుస్తోంది. షోయబ్ అనే యువకుడు బాలికను పెళ్లి చేసుకుంటానంటూ కొన్నాళ్లుగా వేధిస్తున్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం సంబంధం అతడి కుటుంబసభ్యులు వచ్చి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఆమె మైనర్ కావడం, చదువుకుంటుండంతో ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని బాలిక తల్లిదండ్రులు వారికి చెప్పారు. Also Read: దీంతో ఆమె తనకు దక్కదన్న కక్షతో షోయబ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండటంతో పోలీసులు అతడి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భవనంపైన రక్తపు మరకలు ఉండటంతో బాలికను తీవ్రంగా హింసించి తోసేసినట్లు తెలుస్తోంది. ఆమెపై అత్యాచారం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం రిపోర్టు వస్తే దీనిపై క్లారిటీ వస్తుందని పోలీసులు చెబుతున్నారు. Also Read:


By January 24, 2020 at 11:06AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/15-yr-old-girl-brutally-murdered-in-secunderabad-police-suspects-her-gets-rape/articleshow/73573436.cms

No comments