Breaking News

కొంప ముంచిన సెల్ఫీ వీడియో.. నటికి నోటీసులు


ఒక్కోసారి సెలబ్రిటీల అత్యుత్సాహం వారికి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. తాజాగా అలాంటి పరిస్ధితులోనే ఉంది నటి . పలు తెలుగు చిత్రాల్లోనూ నటించిన ఈ కన్నడ బ్యూటీ ఓ సెల్పీ వీడియో కారణంగా ఇబ్బందుల్లో పడింది. బెంగళూరులోని మెజెస్టిక్‌ రోడ్‌లో కారు నడుపుతూ తీసుకున్న ఓ సెల్ఫీ వీడియోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది సంజన. సంక్రాంతి కానుకగా రిలీజ్‌ అయిన సూపర్‌ స్టార్ మహేష్ బాబు సినిమా చూసేందుకు వెళ్లింది సంజన. అలా వెళ్లే సమయంలో తన ఎగ్జైట్మెంట్‌ను అభిమానులతో పంచుకుంటూ ఓ సెల్పీ వీడియోనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ప్రమాదకరంగా కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకోవటంపై బెంగళూరు ట్రాఫిక్‌ పోలీస్‌లు సీరియస్‌ అయ్యారు. విచారణకు హాజరు కావాలంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. Also Read: డ్రైవింగ్‌ చేస్తూ మొబైల్‌ వాడిన కారణంగా సంజనపై కేసు నమోదు చేసి ఆమెకు నోటీసులు పంపించారు. సాధారణ వ్యక్తుల కంటే సెలబ్రిటీలు ఇలాంటి విషయాల్లో బాధ్యత వ్యవహరించాలని వారు కోరుతున్నారు. తారల సోషల్ మీడియా పేజ్‌లను అభిమానులు పెద్ద సంఖ్యలో ఫాలో అవుతుంటారు. వారి చర్యలకు చాలా మంది ప్రభావితమయ్యే అవకాశం ఉందంటున్నారు. Also Read: బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన సంజన తరువాత సర్థార్ గబ్బర్‌సింగ్‌, దండుపాళ్యం లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ తమిళ్‌లో బాక్సర్‌, పొడముండమ్‌ సినిమాల్లో నటిస్తోంది.


By January 14, 2020 at 10:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kannada-actress-sanjana-galrani-break-traffic-rules-traffic-police-issued-notice/articleshow/73239309.cms

No comments