జైలుకెళ్లొచ్చినా బుధ్ది మారలేదు.. మహిళా టెక్కీని కారులోకి లాగి అఘాయిత్యం

పెళ్లి చేసుకోవాలంటూ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను వేధిస్తున్న వ్యక్తిపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతంలో నివాసముంటున్న ఓ మహిళ మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. గతంలో ఆమె ఓ ట్రావెల్స్ కార్యాలయంలో పనిచేసింది. ఆ సమయంలో ఘట్‌కేసర్‌లోని కొండాపూర్ ప్రాంతానికి చెందిన అఖిల్(30) అనే వ్యక్తి సూపర్‌వైజర్‌గా పని చేసేవాడు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమెను అనేకసార్లు వేధించాడు. దీంతో బాధితురాలు అప్పట్లో తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. Also Read: ఆ తర్వాతి పరిణామాలతో అక్కడ ఉద్యోగం మానేసిన యువతి ఓ ఐటీ సంస్థలో చేరింది. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన అఖిల్ ఆ యువతి సమాచారం కనుక్కుని మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. శనివారం సాయంత్రం మాదాపూర్‌లోని ఆమె పనిచేసే కంపెనీ దగ్గరకు వెళ్లిన అఖిల్ తన కారు ఎక్కాలంటూ ఆమెను బలవంతం చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడిపై కేసులు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read: Also Read:
By January 06, 2020 at 08:57AM
No comments