Breaking News

రోడ్డుప్రమాదంలో యువతి మృతి.. కొద్దిరోజుల్లో డాక్టర్ కాబోతూ


జిల్లాలో సోమవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం నెలకొంది. గుడుపల్లె మండలం శెట్టిపల్లె వద్ద కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో పీజీ వైద్య విద్యార్థిని కీర్తి (26) దుర్మరణం చెందగా..మరో విద్యార్థి ప్రణవ్‌ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కర్నూలు పట్టణంలో టీచర్‌గా పనిచేస్తున్న దామోదరం కుమార్తె కీర్తి పీఈఎస్‌ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి.. ప్రస్తుతం పీజీ సెకండియర్ చదువుతోంది. అనంతపురానికి చెందిన వెంకటేశ్వర్లు ఉద్యోగరీత్యా గుంటూరులో ఉంటున్నారు. ఆయన కుమారుడు ప్రణవ్‌ పీఈఎస్‌లో పీజీ ఫస్టియర్ స్టూడెండ్. Also Read: సోమవారం రాత్రి కీర్తి, ప్రణవ్‌.. స్నేహితులు, క్లాస్‌మేట్స్‌తో కలిసి కుప్పంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో పీఈఎస్‌ హాస్టల్‌కు చేరుకునే క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారును శెట్టిపల్లె వద్ద ఎదురుగా కుప్పం వైపు వెళ్తున్న అంబులెన్స్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జయింది. ఈ ఘటనలో కీర్తి అక్కడికక్కడే చనిపోగా.. ప్రణశ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని పీఈఎస్‌ ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు. కీర్తి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. Also Read: గడిచిన ఎనిమిదేళ్లుగా పీఈఎస్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న ఇకలేదన్న సమాచారంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు, క్లాస్‌మేట్స్, లెక్చరర్లు విషాదంలో మునిగిపోయారు. ఎంబీబీఎస్‌ను విజయవంతంగా పూర్తి చేసిన కీర్తి.. పీజీ కోర్సును కూడా పీఈఎస్‌లో పూర్తి చేయాలన్న ఆశయంతో ఎనిమిదేళ్లుగా హాస్టల్‌లోనూ ఉంటూ చదువుకుంటోంది. స్నేహితులతో పుట్టిన రోజు వేడుకలకు హాజరై ఇలా విగత జీవి మారుతుందని తాము కలలో కూడా ఊహంచలేదని క్లాస్‌మేట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో కీర్తి చనిపోయిందని తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హుటాహుటిన కుప్పం చేరుకున్నారు. కుమార్తె మృతదేహం వద్ద తల్లిదండ్రుల రోదనలు అందరినీ కలచివేశాయి. Also Read:


By January 15, 2020 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/pg-medcial-student-keerthi-died-in-road-accident-near-kuppam-chittor-district/articleshow/73261862.cms

No comments