Breaking News

పాకెట్ మనీ కోసం వ్యభిచారం చేస్తూ పట్టుబడిన యువతులు.... షాకైన పోలీసులు


పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దేశవ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలు మాత్రం అడ్డూఅదుపూ లేకుండా సాగిపోతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో కొందరు సినిమా తారలు సైతం అవకాశాలు లేక వ్యభిచార కూపంలో చిక్కుకుంటున్నారు. గతవారం ముంబయిలో చేధించిన ఓ సెక్స్‌రాకెట్‌లో పలువురు బాలీవుడ్ తారలు పట్టుబడిన సంగతి మరువకముందే మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. Also Read: ముంబయిలోని అంధేరి ప్రాంతంలో గల ఇంపీరియల్ ప్యాలెస్‌ హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు మంగళవారం ప్లాన్ ప్రకారం అక్కడ రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు విదేశీ యువతులతో సహా ముగ్గురు సెక్స్‌వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ దందాను గుట్టుగా నిర్వహిస్తున్న ప్రొడక్షన్ మేనేజర్ నవీద్ షరీఫ్ అహ్మద్ అక్తర్, కాస్టింగ్ డైరెక్టర్ నవీద్ సాదిక్ సయ్యద్‌లను అరెస్టు చేశారు. ముగ్గురు మహిళలకు విముక్తి కల్పించి వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఇద్దరు విదేశీ అమ్మాయిలు తుర్కెమినిస్థాన్‌కు చెందిన వారని, పుణెలోని ఓ కాలేజీ చదువుకుంటూ పాకెట్ మనీ వ్యభిచారం చేస్తున్నట్లు పోలీసుల గుర్తించారు. Also Read: మరో మహిళ బాలీవుడ్ సినిమాల్లో నటించాలన్న కోరికతో ముంబయికి వచ్చింది. అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలోనే అక్తర్, సయ్యద్‌లతో పరిచయం ఏర్పడింది. వ్యభిచారం చేస్తే రూ.లక్షల్లో సంపాదించొచ్చని ఆమెకు మాయమాటలు చెప్పి ఆ కూపంలోకి దించినట్లు పోలీసులు గుర్తించారు. సినిమా అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను వీరు టార్గెట్ చేసుకుని వ్యభిచారిణులుగా మారుస్తున్నారని పోలీసులు తెలిపారు. Also Read:


By January 24, 2020 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mumbai-police-busted-sex-racket-in-andheri-area-3-women-rescued/articleshow/73571964.cms

No comments