Breaking News

యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి.. కోరిక తీర్చాలంటూ వేధింపులు


యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు కటకటాల పాలైన ఘటన తమిళనాడులో జరిగింది. రామనాథపురం జిల్లా కీళకరై సమీపంలోని కన్నిరాజపురం ప్రాంతానికి చెందిన యువతి ఈ నెల 1వ తేదీన ఇంట్లోని బాత్‌రూమ్‌లో స్నానం చేస్తోంది. ఆమెపై ఎప్పటి నుంచో కన్నేసిన అదే ప్రాంతానికి చెందిన ఎబేసన్‌ (23) అతని స్నేహితులు ఎబిరోన్, విఘ్నేష్‌ చాటుగా సెల్‌ఫోన్‌‌తో వీడియో తీశారు. ఆ వీడియోను కాసేపటి తర్వాత ఆ యువతికి వాట్సాప్‌లో పంపించారు. తమ కోరిక తీర్చకపోతే దాన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తామని బెదిరించారు. Also Read: ఈ ఘటనపై బాధితురాలు ఈ నెల 2న కీళ్‌కరై మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే కన్యాకుమారి జిల్లా తేంగాయ్‌పట్టినం తీర ప్రాంతంలో దాగి ఉన్న ఎబేసన్‌ను కీళకరై పోలీసులు మెరైన్ పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. అతన్ని కీళకరై పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. Also Read:


By January 27, 2020 at 10:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-man-arrest-for-video-filming-while-bathing-woman/articleshow/73653221.cms

No comments