గుంపుగా వచ్చి కొట్టేశారు.. పంజాగుట్ట లలితా జ్యువెలరీలో ఆభరణాల చోరీ

హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జ్యువెలర్స్ దుకాణంలో ఆభరణాలు చోరీకి గురయ్యాయి. సిబ్బంది దృష్టి మళ్లించి దొంగలు 92 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకున్నరు. ఈ నెల 15వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో కొందరు వినియోగదారులు గుంపుగా వచ్చారు. ఆభరణాలు చూపించాలంటూ సిబ్బందిని కోరారు. Also Read: దీంతో సిబ్బంది వారికి కొన్ని నగలు చూపించారు. చాలాసేపటి వరకు ఏదీ సెలక్ట్ చేసుకోకుండా కాలక్షేపం చేశారు. ఈ క్రమంలోనే సిబ్బంది దృష్టి మళ్లించేలా చేసి రూ.3.5 లక్షల విలువ చేసే రెండు బంగారు గొలుసులు, ఒక బ్రాస్‌లెట్ చోరీ చేశారు. సంస్థలో నిర్వహించిన ఆడిట్‌లో ఈ విషయం బయటపడింది. దీంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది సీసీ కెమెరా పుటేజీని పరిశీలించగా అసలు నిజం బయటపడింది. దీంతో షోరూమ్ మేనేజర్ కె.హరిసుందర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also Read:
By January 22, 2020 at 12:08PM
No comments