Breaking News

9 ఏళ్ల బాలికపై బాబాయి అత్యాచారం.. చాక్లెట్లు ఇస్తానని ఆశచూపి..


జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన అతడు వావివరసలు మరిచాడు. తండ్రి తర్వాత తండ్రి అయిన వాడే కంటికి రెప్పలా చూసుకోవాల్సిన చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వరుసకు కూతురయ్యే 9 ఏళ్ల చిన్నారిపై సొంత బాబాయే అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా మండలంలోని మర్లపాలెంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మునగాల సుబ్బారెడ్డి (35) వికలాంగుడు. అతడు తన ఇంట్లోనే చిల్లర వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. Also Read: ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం వరుసకు కూతురయ్యే చిన్నారి తన ఇంటి వద్ద ఒంటరిగా ఆడుకుంటుండగా సుబ్బారెడ్డి బాలికకు చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపాడు. బాలిక అతడి మాటలు నమ్మి సుబ్బారెడ్డి ఇంట్లోకి వెళ్లింది. దీన్ని అదనుగా భావించిన అతడు కామంతో కళ్లు మూసుకుపోయి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పొలం పనులకు వెళ్లిన బాధితురాలి తల్లిదండ్రులు రాత్రికి ఇంటికి వచ్చారు. భయంతో వణికిపోతూ బాలిక జరిగిన దురాగతాన్ని తల్లిదండ్రులకు చెప్పి కన్నీటిపర్యంతమైంది. వెంటనే వారు కురిచేడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దర్శి డీఎస్సీ కె.ప్రకాశ్‌రావు, సీఐ మొహ్మద్‌ మోయిన్‌లు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. కాగా, నిందితుడు తన బంకు వద్దకు తినుబండారాలు కొనేందుకు వచ్చే చిన్నారులపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతుంటాడని గ్రామస్తులు తెలిపారు. ఇటీవల కొందరు చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. Also Read:


By January 18, 2020 at 11:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ongole-man-raped-9-year-girl/articleshow/73350576.cms

No comments