Breaking News

ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో హోటల్‌కి వెళ్లిన వివాహిత.. రేప్ చేసి రూ.5లక్షల డిమాండ్


సోషల్‌మీడియా వినియోగం పెరిగాక అందరికీ బయటకంటే అందులోనే స్నేహితులు ఎక్కువ మంది ఉంటున్నారు. చాలామంది ఊరు పేరు తెలియని వాళ్లతో వ్యక్తిగత వివరాలు షేర్ చేసుకుని చిక్కుల్లో పడుతున్నారు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని భివాడికి చెందిన మహిళ ఇలాగే ఫేస్‌బుక్ ఫ్రెండ్‌ని నమ్మి జీవితాన్ని నాశనం చేసుకుంది. అతడి చేతిలో అత్యాచారానికి గురై మానసిక క్షోభకు గురవుతోంది. Also Read: భివాడికి చెందిన వివాహితకు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన షేర్ సింగ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే వారిద్దరు చాలా సన్నిహితులయ్యారు. దీంతో షేర్ సింగ్ అప్పుడప్పుడూ ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఓ రోజు ఆ మహిళ జైపూర్‌లో ఉండే తన సోదరి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. భర్త తనకు రావడం కుదరదని చెప్పడంతో ఆమె షేర్ సింగ్‌ సాయం కోరింది. జైపూర్ వరకు తాను తోడు వస్తానని చెప్పిన అతడు ఆ మహిళతో కలిసి బయలుదేరాడు. జైపూర్ చేరుకున్నాక ఫ్రెషప్ అవుదామంటూ ఆమెను ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పథకం ప్రకారం ఆమె తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. దాన్ని తిన్న తర్వాత ఆమె మత్తులోకి జారుకోగా దుస్తులన్నీ విప్పేసి అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ తతంగాన్నంతా తన సెల్‌ఫోన్లో రికార్డ్ చేశాడు. Also Read: కాసేపటికి తేరుకున్న బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకుని అతడిని నిలదీసింది. దీంతో రేప్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు ఆమెకు చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. తనకు రూ.5లక్షలు ఇవ్వకపోతే వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తానని బెదిరించాడు. అతడు వేధింపులు భరించలేకపోయిన బాధితురాలు చివరికి భర్తకు విషయం చెప్పింది. దీంతో అతడు తన భార్యను భివాడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నాడు. Also Read:


By January 13, 2020 at 12:20PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/facebook-friend-raped-alwar-married-woman-police-booked-case/articleshow/73223856.cms

No comments