Breaking News

పండుగ రోజు మద్యం తాపించి.. 19 కత్తిపోట్లు పొడిచి..


సంక్రాంతి పండుగ రోజు దావత్‌ చేసుకుందామని నమ్మించి స్నేహితుడిని దారుణంగా చేశాడో వ్యక్తి. శరీరంపై 19 సార్లు కత్తిపోట్లు పొడిచి ఘోరంగా హతమార్చాడు. అనంతరం శరీరం నిండా రక్తపు మరకలు, చేతిలో కత్తితో నిందితుడు హల్‌చల్‌ చేశారు. ఈ సంఘటన తెలంగాణలోని మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడకు చెందిన యాదగౌడ్‌ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌ నగరానికి వలసవచ్చాడు. దుండిగల్‌ పరిధిలోని చర్చ్‌గాగిల్లాపూర్‌లో నివాసముంటున్నారు. మేడ్చల్‌లో వాహనాలకు ఫైనాన్స్‌ ఇచ్చే సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా నివాసముండే ఆసిఫ్‌ (28) అనే డీసీఎం డ్రైవర్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. Also Read: ఈ నేపథ్యంలో బుధవారం సంక్రాంతి పండుగ రోజున రాత్రి 7 గంటల సమయంలో యాదగౌడ్‌ ఇంటికి వచ్చిన ఆసిఫ్‌ పండుగ సందర్భంగా మద్యం తాగుదామని చెప్పి బయటకు తీసుకెళ్లాడు. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్‌ల ఇళ్ల సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ పీకలదాకా మద్యం తాగారు. అనంతరం యాదగౌడ్‌పై ఆరిఫ్‌ దారుణంగా కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా శరీరంపై 19 సార్లు పొడిచాడు. తర్వాత నేరుగా మృతుడి ఇంటికి వెళ్లి యాదగౌడ్‌ను హత్యచేసినట్లు అతడి భార్యతో చెప్పడంతో ఆమె హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లింది. అప్పటికే భర్త రక్తపుమడుగులో పడి మృతిచెంది ఉన్నాడు. Also Read: దీంతో స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసిన అనంతరం దుండిగల్‌ పోలీసులకు అప్పగించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా మృతుడి శరీరంపై ఏకంగా 19 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేవలం ఛాతి భాగంలోనే 10 పోట్లు ఉన్నాయన్నారు. ఘటనాస్థలంలో క్లూస్‌ టీమ్ ఆధారాలను సేకరించింది. ప్రస్తుతం మృతుడితో పాటు నిందితుడి కాల్‌డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. Also Read:


By January 17, 2020 at 12:31PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/medchal-man-brutally-murdered-by-his-friend/articleshow/73321679.cms

No comments