Breaking News

హైదరాబాద్ వ్యాపారికి సైబర్ షాక్.. లండన్ నుంచి రూ.15లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు


లండన్‌కు చెందిన సైబర్ నేరగాళ్ల చేతిలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త దారుణంగా మోసపోయారు. నగరంలో ఏసీ, ఫ్రిజ్‌లు స్పేర్ పార్ట్స్ విక్రయించే చమన్‌లాల్ అనే వ్యాపారి కొద్దిరోజుల క్రితం చైనాకు చెందిన కంపెనీతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. స్టాక్ కావాల్సినప్పుడల్లా చైనా కంపెనీకి ఆర్డర్ పెడుతుంటాడు. స్టాక్ డెలివరీ కాగానే డబ్బులు ఆన్‌లైన్లో ట్రాన్స్‌ఫర్ చేస్తుంటాడు. ఇలా చాలాకాలంలో ఇరువర్గాల మధ్య వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. Also Read: అయితే ఇటీవల ఆ కంపెనీ వెబ్‌సైట్‌‌ని లండన్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. కంపెనీతో పెద్దమొత్తంలో నగదు వ్యవహారాలు జరిపే వ్యాపారులను గుర్తించి స్టార్ డెలివరీ అయినట్లు వారికి మెయిల్స్ పంపించారు. ఈ మెయిల్ చూసుకున్న చమన్‌లాల్ కంపెనీకి రూ.15లక్షలు ఆన్‌లైన్లో ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇది జరిగిన రెండ్రోజుల తర్వాత చైనా కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేసి స్టాక్ డెలివరీ చేశామని, డబ్బులు ఎప్పుడు పంపిస్తారని అడిగారు. దీంతో కంగుతిన్న ఆయన డబ్బులు ఆన్‌లైన్లో పంపించేశానని చెప్పి ఆధారాలు చూపించాడు. Also Read: డబ్బులు తమ బ్యాంక్ అకౌంట్‌కు రాలేదని, ఎవరి ఖాతాకో వెళ్లిపోయి ఉంటాయని వారు చెప్పారు. ఆ మెయిల్ కూడా తాము పంపలేదని వారు చెప్పడంతో అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకున్నాడు. అందులో చిన్నపాటి అక్షర దోషంతో పాటుగా సెక్యూరిటీ కోడ్‌‌ను సరిగ్గా చూసుకోకుండానే డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆయన గుర్తించాడు. దీంతో బాధితుడు వెంటనే హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైబర్ హ్యాకర్ చిన్న చిన్న అక్షర దోషాలను అడ్డం పెట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తారని, నగదు వ్యవహారాలకు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. Also Read:


By January 31, 2020 at 11:43AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-cyber-police-filed-complaint-on-london-cyber-hackers/articleshow/73794224.cms

No comments