గర్భం దాల్చిన 12ఏళ్ల గిరిజన బాలిక... శ్రీకాకుళం జిల్లాలో కలకలం

జిల్లాలో 12ఏళ్ల బాలిక గర్భం దాల్చడం కలకలం రేపింది. శుక్రవారం జాతీయ బాలికా దినోత్సవం కావడంతో సిరిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గిరిజన బాలికల ఆరోగ్య పరీక్షలు చేస్తుండగా గర్భిణి అనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ శరత్‌చంద్రశివకుమార్ సీతంపేట ఐటీడీఏ అధికారులకు సమాచారం ఇచ్చారు. Also Read: వైఎస్సార్ క్రాంతి పథం ఏపీఎం ఎ.లలితను గుడ్డికోల గ్రామానికి వెళ్లి పరిస్థితి పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు రావడంతో ఆమెతో పాటు సీసీ ముఖలింగం గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించారు. బాలిక(12) స్వస్థలం ఒడిశాలోని గంజాం జిల్లా బత్రసాయి సమీపంలోని గౌడు గ్రామం. ఆమె తల్లిదండ్రులు మరణించడంతో అనాథగా మారింది. శ్రీకాకుళం జిల్లా మండలంలోని బుడారిసింగి పంచాయతీ గుడ్డికోల గ్రామానికి చెందిన యువకుడికి ఆమె మేనకోడలు అవుతుంది. Also Read: దీంతో బాలికను తన ఇంటికి తీసుకొచ్చిన యువకుడు ఆమెను బాల్య వివాహం చేసుకుని కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆమె రెండు నెలల గర్భంతో ఉన్నట్లు తేల్చారు. ఈ ఘటనపై సీతంపేట ఐటీడీఏ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నారు. Also Read:
By January 26, 2020 at 08:57AM
No comments