మసాజ్ కోసం అమ్మాయిని బుక్ చేసుకుంటే.. రూ.11లక్షలు కొట్టేశారు.
బాడీ మసాజ్ పేరుతో మగాళ్లకు ఎరవేసి వారి నుంచి డబ్బును కాజేస్తున్న ముఠాను ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందమైన అమ్మాయిలతో బాడీ మసాజ్ చేయిస్తామంటూ పారిస్‌లోని వివిధ ప్రాంతాల్లో మహిళా గ్యాంగ్ ప్రచారం చేస్తోంది. వారి ప్రకటనలను నమ్మి అమ్మాయిని బుక్ చేసుకున్న వారికి ఆ గ్యాంగ్ చుక్కలు చూపిస్తోంది. ఇలాగే వీరి ఎరలో పడిన ఓ వ్యక్తి ఏకంగా రూ.11లక్షలు పోగొట్టుకున్నాడు. Also Read: టర్కీకి చెందిన ఓ వ్యక్తి పారిస్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ పబ్‌లో అతడికి అమ్మాయి పరిచయమైంది. ఆమె నంబర్ తీసుకుని వాట్సాప్ తీసుకుని చాటింగ్ చేసేవాడు. ఈ క్రమంలోనే తనకు బాడీ మసాజ్ కావాలని కోరడంతో ఓ అమ్మాయిని పంపిస్తానని చెప్పి అడ్రస్ తీసుకుంది. అందమైన అమ్మాయితో బాడీ మసాజ్ చేయించుకుంటున్నానన్న ఆనందం అతడికి కొద్ది క్షణాల్లోనే ఆవిరైంది. కాలింగ్ బెల్ మోగగానే ఉత్సాహంగా తలుపు తీశాడు. అంతే ఒక్కరు కాదు ఏకంగా 8మంది ఆఫ్రికన్ అమ్మాయిలు అతడి రూమ్‌లోకి దూసుకొచ్చారు. Also Read: అతడి నోరు నొక్కేసి నిర్బంధించి మంచానికి కట్టేశారు. బాధితుడి వద్దనున్న రూ.11లక్షల నగదు, సెల్‌ఫోన్, ఇతర విలువైన వస్తువులను దోచుకుని పరారయ్యారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అతడి కట్టువిప్పి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాధితుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన దారుణాన్ని వివరించి ఫిర్యాదు చేశాదు. దీంతో పోలీసులు టెక్నాలజీ సాయంతో ప్రధాన నిందితురాలిని ట్రాప్ చేసి ముఠాను అరెస్ట్ చేశారు. వీరు గతంలోనూ ఇదే విధంగా మరికొందరిని మోసం చేసినట్లు గుర్తించారు. Also Read:
By January 12, 2020 at 10:45AM
No comments