రంగారెడ్డి జిల్లాలో దారుణం.. వృద్ధురాలి చంపి 10 తులాల నగలు చోరీ

రంగారెడ్డి జిల్లా మండలం కందుకూరు గ్రామంలో దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సర్కారీ బాలమణి(80) అనే వృద్ధురాలిని గొంతు నుమిలి చంపేసిన దుండగులు... ఆమె ఒంటిపై ఉన్న 10 తులాల బంగారు అభరణాలను ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటి సమీపంలోనే విగతజీవిగా పడివున్న బాలమణిని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: ఇబ్రహీంపట్నం ఏసీపీ కాసేపటికే సిబ్బందిని వెంటబెట్టుకుని గ్రామానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇది దోపిడీ దొంగల పనా? లేక అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల పనా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. Also Read: బాలామణికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా ఆమె గ్రామంలోనే ఒంటరిగా ఉంటూ సొంత పొలంలో వ్యవసాయం చేయిస్తోంది. ఆమె గురించి పక్కా సమాచారం తెలుసుకునే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గ్రామంలోని పలువురు అనుమానితులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. Also Read:
By January 28, 2020 at 10:11AM
No comments