Breaking News

సమయం లైవ్ న్యూస్: న్యూజెర్సీ కాల్పుల్లో ఆరుగురు మృతి.. పవన్ ‘రైతు సౌభాగ్యదీక్ష’


అమెరికాలో కాల్పుల మోత: అమెరికాలో మరోసారి గన్ కల్చర్ పడగవిప్పింది. న్యూజెర్సీలో జరిగిన కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు పోలీస్ అధికారులు, ఓ పౌరుడు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు దుండగులు, ఒక పోలీస్ అధికారి ఉన్నారు. జెర్సీ నగరంలోని ఓ మాల్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. నేడు రాజ్యసభకు క్యాబ్ 2019: కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివాదాస్పద బిల్లుపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఎన్‌డీఏ సర్కారు మాత్రం వెనక్కుతగ్గడం లేదు. రెండు రోజుల కిందట లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బుధవారం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. పవన్ టార్గెట్ జగన్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 12న దీక్షకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కాకినాడలో చేసే ఈ దీక్షకు జనసేన పార్టీ ‘రైతు సౌభాగ్య దీక్ష’గా నామకరణం చేసింది. దీక్షకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ కార్యాలయంలో పవన్‌ కళ్యాణ్ ఆవిష్కరించారు. ప్రభుత్వం రైతుల సమస్యల్ని పరిష్కరించాలనే డిమాండ్‌తో పవన్ ఈ దీక్షకు సిద్ధమయ్యారు. వివేకా హత్య కేసులో విచారణకు ఆది: ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు సంబంధించి అనుమానితులతో పాటూ సాక్ష్యుల్ని వరుసగా విచారణకు పిలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డిని వివేకా హత్యకేసులో విచారణకు పిలవగా.. నేడు సిట్ ముందు హాజరుకానున్నారు.


By December 11, 2019 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-11th-december-2019/articleshow/72466404.cms

No comments