Breaking News

ఆ సీన్స్‌కు ఓకే అంటున్న చిరంజీవి హీరోయిన్


ఒకప్పుడు అగ్ర కథానాయకుల సరసన నటించి మంచి స్టార్‌డం దక్కించుకున్నారు భూమిక. ‘ఖుషి’, ‘ఒక్కడు’, ‘వాసు’, ‘సింహాద్రి’ వంటి సినిమాల్లో నటించిన భూమిక ఒకప్పుడు ఉండే క్రేజే వేరు. ఇప్పుడు భూమిక వయసు నాలుగు పదులు దాటింది. అయినప్పటికీ ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అక్క, వదిన వంటి చక్కటి క్యారెక్టర్లతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ‘ఎంసీఏ’, ‘సవ్యసాచి’, ‘యూటర్న్’ వంటి సినిమాల్లో భూమిక పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘రూలర్’ సినిమాలో భూమిక కీలక పాత్రలో నటించారు. అయితే తాను బోల్డ్ సీన్స్‌లో నటించడానికి కూడా రెడీయేననని అంటున్నారు భూమిక. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘ఇప్పుడిప్పుడు మంచి పాత్రలు వస్తున్నాయి. నాకు వెబ్ సిరీస్ చేయాలని ఉంది. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే నేను బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి కూడా సిద్ధమే’’ అని తెలిపారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో భూమికకు ఉండే క్రేజే వేరు. ఆమె సినిమాలన్నీ వరుసగా హిట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. అదీకాకుండా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఏడో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. అవే ఖుషి, ఒక్కడు, సింహాద్రి. ఈ మూడు సినిమాల్లో భూమికే హీరోయిన్. అప్పట్లో భూమికను గోల్డెన్ లెగ్ అని వర్ణించేవారు. చక్కటి అందం, అభినయంతో తెలుగులోనే కాదు హిందీ ప్రేక్షకుల మనసులూ దోచుకుంది. ప్రస్తుతం భూమిక ‘కన్నాయ్ నంబతే’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు.


By December 21, 2019 at 09:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-bhumika-chawla-says-she-is-open-to-do-bold-scenes-if-the-scripts-demands/articleshow/72911425.cms

No comments