బియ్యం సరఫరా చేస్తూ కన్నేశాడు.. పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడు

కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటున్న మహిళను పెళ్లి పేరుతో వేధిస్తున్నాడో వ్యాపారి. ఇద్దరు పిల్లలతో బతుకీడుస్తున్న ఆమెపై కన్నేసిన ఆ కామాంధుడు తనను పెళ్లి చేసుకోకపోతే అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగాడు. హైదరాబాద్‌లోని మౌలాలి ప్రాంతానికి చెందిన మహిళ(33)కు గుంటూరుకు చెందిన వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. Also Read: దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో ఆ మహిళ మౌలాలిలోని పుట్టింట్లో ఉంటూ ఓ ప్రైవేటు స్కూల్‌లో పనిచేస్తోంది. పార్శిగుట్టకు చెందిన బొమ్ముళ్ల రాజు(30) అనే వ్యక్తి మౌలాలి ప్రాంతంలోని దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకున్న రాజు తాను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. Also Read: ఆమె తిరస్కరించడంతో కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో మహిళ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన రాజు తల్లిదండ్రులు ఎదుటే ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అసభ్యంగా మాట్లాడుతూ తీవ్రంగా కొట్టాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ఆదివారం రాత్రే బాధితురాలు మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
By December 10, 2019 at 12:40PM
No comments