Breaking News

హైదరాబాద్‌లో విషాదం.. భార్య, కుమార్తె ఎదుటే టిప్పర్ చక్రాల కింద నలిగిన వ్యక్తి


కూతురిని హాస్టల్‌లో దించేందుకు వెళ్తూ రోడ్డుప్రమాదంలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో చోటుచేసుకుంది. టిప్పర్ అతివేగం ఆ కుటుంబ పెద్దను దూరం చేయడంతో తల్లీకూతుళ్లు రోదిస్తున్నారు. సిద్దిపేట జిల్లా గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన చెన్నోజు శ్రీనివాస్‌(40) భార్య లక్ష్మితో కలిసి బతుకుదెరుకు 6 నెలల క్రితం నగరానికి వచ్చాడు. ప్రస్తుతం మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పురపాలక సంఘం పరిధిలోని అంబేడ్కర్‌నగర్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. Also Read: అతడి కుమార్తె కీర్తి సిద్దిపేటలోని ఓ కాలేజీ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. కుమార్తెను హాస్టల్‌లో దించేందుకు ఆదివారం సాయంత్రం భార్య లక్ష్మితో పాటు కుమార్తెను తీసుకుని శ్రీనివాస్‌ బైక్‌పై బయలుదేరాడు. వీరు బాలాజీనగర్‌ కరెంట్ ఆఫీసుకు వచ్చేసరికి వెనుక నుంచి ఓ టిప్పర్ వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. Also Read: దీంతో అదుపుతప్పిన లక్ష్మీ, కీర్తి దూరంగా పడిపోగా... శ్రీనివాస్‌పై నుంచి టిప్పర్ వెళ్లిపోయింది. చక్రాల కింద నలిగిపోవడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లీకూతుళ్లు షాక్‌లోకి వెళ్లిపోయారు. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదం ఆ కుటుంబానికి పెద్దను దూరం చేయడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. Also Read:


By December 16, 2019 at 09:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-from-siddipet-killed-in-road-accident-in-hyderabad/articleshow/72731523.cms

No comments