Breaking News

మహిళా కండక్టర్‌పై యాసిడ్ దాడి.. పరిస్థితి విషయం


కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. మహిళా కండక్టర్‌పై ఇద్దరు దుండగులు యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు. బాగలగుంటె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. Also Read: హవనూరు లేఅవుట్‌లో నివాసముంటున్న ఇందిరాబాయి(35) అనే మహిళ పీణ్యా 9వ బీఎంటీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం 5.45 గంటలకు ఇంటి నుంచి విధుల కోసం డిపోకు నడిచి వెళ్తుండగా ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆమెపై యాసిడ్‌ చల్లి పరారయ్యారు. ఈ ఘటనలో ఇందిరాబాయి ముఖం, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. Also Read: ఆమె కేకలు విని నిద్రలేచిన స్థానికులు బాధితురాలిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై బాగలగుంటె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తుముకూరుకు చెందిన ఇందిరాబాయి, బాలాజీ దంపతులు 18 నెలలలుగా బాగలగుంటె ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆమె భర్త బాలాజీ కూడా బీఎమ్‌టీసీలో డ్రైవర్‌. వీరికి ఇద్దరు సంతానం. Also Read:


By December 20, 2019 at 10:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/acid-attack-on-woman-bmtc-conductor-in-bengaluru/articleshow/72896195.cms

No comments