బంజారాహిల్స్ హోటల్‌లో వ్యభిచారం.. బాలీవుడ్ నటి సహా ముగ్గురి అరెస్ట్

నగరం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. బేగంపేటలోని లిస్బన్ పబ్‌లో వ్యభిచార దందా గుట్టురట్టు చేసి 24 గంటలు గడవకముందే నగరంలో మరో సెక్స్ రాకెట్‌ను పోలీసులు చేధించారు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో బాలీవుడ్ హీరోయిన్‌లో చేయిస్తుండగా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో సినీనటితో పాటు సీరియల్ నటిని రక్షించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. Also Read: ముంబయికి చెందిన బాలీవుడ్ సెకండ్ గ్రేట్ హీరోయిన్‌తో పాటు ఓ సీరియల్ నటితో బంజారాహిల్స్‌లోని హోటల్‌లో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు గురువారం ఆ హోటల్‌పై రైడ్ చేశారు. సినీతారతో పాటు కాస్టింగ్ డైరెక్టర్, ఈవెంట్ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. హోటళ్లలో ఈవెంట్ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి పలువురు హీరోయిన్లు, మోడల్స్‌ని రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. Also Read: గతంలోనూ బంజారాహిల్స్‌లో భోజ్‌పురి, హిందీతో పాటు తెలుగు సినిమాలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి హీరోయిన్లతో వ్యభిచారం చేయిస్తూ దొరికిన ఘటనలు ఉన్నాయి. తాజాగా బంజారాహిల్స్‌లో మరో లగ్జరీ సెక్స్ రాకెట్ బయటపడటంతో పోలీసులు మరింత నిఘా పెడుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంటున్నారు. తాజా ఘటనలతో హైదరాబాద్‌లో అసాంఘిక కార్యకలాపాలు ఏ మేరకు విస్తరించాయో తెలుస్తోంది. సెక్స్ రాకెట్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త పంథా అనుసరిస్తుండటంతో వారిని పట్టుకోవడం కష్టంగా మారుతోంది. Also Read:
By December 20, 2019 at 10:47AM
No comments