సమయం లైవ్ న్యూస్: ట్రంప్‌పై అభిశంసన.. అలీ ఇంట విషాదం

ట్రంప్‌పై అభిశంసన: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనను పదవి నుంచి తప్పించేందుకు ప్రతిపక్ష డెమోక్రాట్లు దిగువ సభలో అభిశంసన తీర్మానం బుధవారంప్రవేశపెట్టారు. ఈ అభిశంసన తీర్మానానికి మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటువేయడంతో ప్రతినిధుల సభ ఆమోదం లభించింది. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లదే ఆధిపత్యం కావడంతో అభిశంసన తీర్మానం ఆమోదం పొందింది. రేప్ ఘటనలపై సుప్రీం ఆందోళన: దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న అత్యాచార ఘటనలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ తరహా నేరాల పెరిగిపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. లైంగిక నేరాల విషయంలో న్యాయం అందుతున్న తీరును అంచనా వేసేందుకు సంబంధిత వ్యాజ్యాన్ని సుమోటోగా స్వీకరించింది. అలాంటి కేసుల్లో విచారణ, సాక్ష్యాల సేకరణ, ఫోరెన్సిక్ నివేదికలు విచారణకు పట్టిన సమయం తదితర వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోర్టులను కోరింది. అలీ ఇంట విషాదం: టాలీవుడ్ స్టార్ కమెడియన్, టెలివిజన్ హోస్ట్ అలీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి జైతున్ బీబీ అనారోగ్యంతో కన్నుమూశారు. రాజమహేంద్రవరంలోని ఆమె స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం రాంచీలో షూటింగ్‌లో ఉన్న ఈ వార్త తెలిసి వెంటనే హైదరబాద్ బయలుదేరి వస్తున్నారు. తెలంగాణలో మరో మానవ మృగం: రాష్ట్రంలో ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ‘దిశ’ హత్యచార నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడా అబలపై అత్యాచారాల ఘటనలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. తాజాగా ఓ నరరూప రాక్షసుడి ఘోరాలు బయటకు రావడంతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. మెదక్‌జిల్లా రామాయంపేట కొత్త చెరువులో ఈనెల 13న దొరికిన గుర్తుతెలియని మహిళ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకిచ్చే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
By December 19, 2019 at 08:54AM
No comments