Breaking News

నా గర్భానికి వారిద్దరే కారణం.. యువతి ఫిర్యాదుతో పోలీసుల షాక్


ఒకరు పెళ్లి మాయమాటలు చెప్పడంతో సర్వస్వం అర్పించిందా యువతి. వీలు చిక్కినప్పుడల్లా ఆ యువకుడు ఆమెను పార్కులకు, సినిమాలకు, లాడ్జిలకు తీసుకెళ్లి తన లైంగిక వాంఛలు తీర్చుకోవడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని గమనించిన మరో యువకుడు ప్రేమ వ్యవహారం అందరికీ చెప్పేస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా కొద్దిరోజులుగా ఇద్దరు కామాంధుల చేతిలో నలిగిపోయిన బాధితురాలు చివరికి గర్భం దాల్చింది. దీంతో తన గర్భానికి ఆ ఇద్దరే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి కంప్లైంట్‌తో షాకైన పోలీసులు ఆమె గర్భానికి ఆ ఇద్దరిలో ఎవరు కారణమో తెలుసుకునే పనిలో పడ్డారు. Also Read: జిల్లా మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతి ఇంటర్‌ వరకు చదువుకుంది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. వారితో కలిసి ఆమె కూడా పనులకు వెళ్లేది. అదే గ్రామానికి చెందిన రామారావు కూలీలను తన వాహనంలో పనులకు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ వ్యవహారాన్ని గమనించిన పైడిరాజు ఆమె తల్లిదండ్రులకు చెప్పేస్తానంటూ బెదిరించి ఆమెపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. Also Read: యువతిలో శారీరక మార్పులు గమనించిన కుటుంబసభ్యులు నిలదీయగా అసలు విషయాన్ని చెప్పింది. వైద్య పరీక్షలు చేయించగా ఆరు నెలల గర్భంతో ఉన్నట్లు తేలింది. దీంతో కుటుంబసభ్యుల ఒత్తిడి మేరకు బాధితురాలు బుధవారం చీపురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రామారావు, పైడిరాజు తనను లైంగికంగా దోచుకున్నారని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు వారిద్దరే కారణమని, వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో చీపురుపల్లి ఎస్ఐ దుర్గాప్రసాద్ ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By December 19, 2019 at 09:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vizianagaram-young-woman-raped-by-two-men-gets-6-months-pregnancy/articleshow/72879363.cms

No comments