Breaking News

మతం మార్చుకున్న యంగ్ హీరో.. త్వరలో పేరు కూడా!


జర్నీ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన కోలీవుడ్ యువ నటుడు జై. 2002లో విజయ్ హీరోగా తెరకెక్కిన భగవతి సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తరువాత సోలో హీరోగా సత్తా చాటాడు. జర్నీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన జై కోలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాలతో పాటు తెలుగమ్మాయి అంజలితో ప్రేమాయణంతో కూడా వార్తల్లో నిలిచాడు ఈ యంగ్ హీరో. అంజలితో కలసి చెట్టాపట్టాలేసుకున్న తిరిగిన ఈ యంగ్ హీరో మేమిద్దం కేవలం ఫ్రెండ్స్‌ మాత్రమే అంటున్నాడు. అయితే వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో నడుస్తున్న పుకారు కోలీవుడ్‌ మీడియాలో తరుచూ వినిపిస్తుంటుంది. తాజాగా మరో జై మరో ఆసక్తికర అంశంతో వార్తల్లో నిలిచాడు. ఈ యంగ్ హీరో మతం మార్చుకున్నట్టుగా వెల్లడించాడు. Also Read: తన తాజా చిత్రం కేప్‌ మారి ప్రమోషన్‌ సందర్భంగా తాను మతం మార్చుకున్న విషయాన్ని వెల్లడించాడు జై. గత ఏడేళ్లుగా తాను ఇస్లాంను పాటిస్తున్నట్టుగా వెల్లడించాడు జై. అంతేకాదు తన నిర్ణయానికి కుటుంబం సభ్యులు కూడా మద్ధతు తెలిపారని.. ఏ దేవుడిని నమ్మకుండా ఉండే కన్నా ఏదో ఒక దేవుడిని నమ్మటం బెటర్‌ అని వాళ్లు భావిస్తున్నారని తెలిపాడు. త్వరలో జై తన పేరును అజీస్‌ జైగా మార్చుకోబోతున్నట్టుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. Also Read:


By December 22, 2019 at 12:08PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kollywood-young-hero-jai-converted-to-islam/articleshow/72922928.cms

No comments