Breaking News

ఏడుగురు మహిళలను రేప్ చేసి చంపేశాడు... మహబూబ్‌నగర్‌లో సైకో రేపిస్ట్


అనేక అత్యాచారాలు, హత్యలతో సంబంధం ఉన్న ఓ నిందితుడిని మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కల్లు కాంపౌండ్ల వద్ద మాటు వేసి మహిళలతో మాటకలిపి వారిపై అఘాయిత్యాలకు పాల్పడేవాడని, తర్వాత వారిని దారుణంగా చంపేసేవాడని విచారణలో తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. దీంతో అతడి నేరాలపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. Also Read: మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర మండలం డోకూర్‌ గ్రామ శివారు పంట పొలాల్లో ఈ నెల 17వ తేదీన ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతురాలిని నవాబుపేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలు(53)గా గుర్తించిన పోలీసులు ఆమె హత్యకు గురైనట్లు తేల్చారు. క్లూస్‌టీం ఇచ్చిన సమాచారం మేరకు దీనిలో పాత నేరస్థుల పాత్ర ఉందనే నిర్ధారణకు వచ్చిన దేవరకద్ర పోలీసులు అనేక మందిని విచారించిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి జిల్లాలో జరిగిన అనేక నేరాలతో సంబంధం ఉన్నట్లు తేలడంతో మరింత లోతుగా విచారణ చేపట్టారు. Also Read: అతను కల్లు కాంపౌండ్‌ల వద్ద మాటు వేసి మహిళలతో మాట కలిపేవాడని, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేసేవాడని తేలడంతో పోలీసులు షాకయ్యారు. అతని చేతిలో ఇప్పటికే ఏడుగురు హత్యకు గురైనట్టు నిర్ధారణకు వచ్చిన పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. ఈ అఘాయిత్యాలన్నీ అతనొక్కడే చేశాడా? ఇంకెవరి పాత్రయినా ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. Also Read:


By December 22, 2019 at 08:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mahabubnagar-police-arrests-serial-rapist-killer-he-involved-7-women-rape-and-murder-cases/articleshow/72921298.cms

No comments