Breaking News

సొంత వదినపైనే ముగ్గురు మరుదులు అత్యాచారం.. గుంటూరులో దారుణం


తల్లిలా గౌరవించాల్సిన వదిననే కామాంధులు చెరబట్టారు. కోడలిని కూతురిలా చూసుకోవాల్సిన మామ కోరిక తీర్చాలంటూ వేధించసాగాడు. ముగ్గురు మరుదులు ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేశారు. అత్తింట్లో అంత బాధ అనుభవిస్తున్నా అండగా ఉండాల్సిన భర్తే తనవాళ్లకు వంతపాడాడు. ఇష్టం ఉంటే ఉండు లేకపోతే వెళ్లిపో అని చెప్పేశాడు. ఆమె ఎదురుతిరిగే సరికి దొంగతనం కేసు మోపి వేధించసాగారు. వారి వేధింపులతో విసిగిపోయిన బాధితురాలు ఎట్టకేలకు ‘స్పందన’ కార్యక్రమంలో పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. Also Read: రూరల్‌ మండలం దాసరిపాలెంకు చెందిన బాధితురాలి కథనం ప్రకారం..‘2011లో పాత గుంటూరుకు చెందిన ఓ వ్యక్తితో నాకు వివాహమైంది. కుటుంబసభ్యుల కోరిక మేరకు మామకు రోజూ సాయంత్ర కాళ్లు పట్టేదాన్ని. ఆ సమయంలో కూతురిలాంటి నాపై ఆయన అసభ్యంగా ప్రవర్తించేవాడు. దాన్ని అలుసుగా తీసుకుని ఇద్దరు మరుదులు నన్ను బెదిరించి అనేకసార్లు అత్యాచారం చేశారు. మూడో మరిది పాలల్లో మత్తుమందు కలిపి నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం భర్తకు చెబితే తమ ఇంట్లో అలాగే ఉంటుందని, ఇష్టం లేకపోతే వెళ్లిపోవాలని అనడంతో పోలీస్‌స్టేషన్‌లో వేధింపుల కేసు పెట్టాను. దీంతో నాపై దొంగతనం మోపి అరెస్టు చేయించారు. బయటకు వచ్చాక విడాకులివ్వాలంటూ బెదిరిస్తున్నారు. లేకపోతే చంపేస్తామంటున్నారు’ అని చెప్పింది. Also Read: సోమవారం గుంటూరు అర్బన్ పోలీసులు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో బాధితురాలు తమ ఆవేదనను పోలీసులకు వివరించింది. కామ పిశాచాల్లా తనపై మామ, మరుదులు లైంగిక దాడికి పాల్పడుతున్నా రక్షించాల్సిన భర్తే వాళ్లకు సహకరించాలని వంత పాడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. వారిపై తగిన చర్యలు తీసుకుని తనకే న్యాయం చేయాలని వేడుకుంది. Also Read:


By December 10, 2019 at 08:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/guntur-marraied-woman-gang-raped-by-3-brother-in-laws/articleshow/72450121.cms

No comments