పెళ్లికి ఒత్తిడి చేసిందని.. బాలికను కొండపై నుంచి తోసేసిన ప్రియుడు

ఏకాంతంగా మాట్లాడాలని ప్రియురాలిని కొండపైకి తీసుకెళ్లిన యువకుడు ఆమెను అక్కడి నుంచి తోసేసి హత్య చేసిన ఘటన తమిళనాడులోని వేలూరులో కలకలం రేపింది. బుధవారం వేలూ రు సమీపంలోని తీర్థగిరి కొండపైన ఉన్న రాళ్ల క్యారీలో ఓ బాలిక మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలిక మిస్సింగ్‌పై ఏమైనా కేసులున్నాయోమోనని విచారణ చేపట్టారు. నార్త్ పోలీస్ స్టేషన్‌లో అరియూర్ కుప్పంకు చెందిన 17 ఏళ్ల బాలిక అదృశ్యంపై కేసు నమోదు అయినట్లు తెలియడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. Also Read: అదృశ్యమైన బాలిక గుర్తులను బట్టి ఆ మృతదేహం ఆమెదేనని పోలీసులు నిర్ధారించారు. మృతురాలు అరియూర్ కుప్పంకు చెందిన శరవణన్ అనే చెప్పుల వ్యాపారి కుమార్తె నివేద(17)గా తేలింది. ఇటీవల ఫ్లస్‌టూ పూర్తి చేసిన నివేద వేలూరులోని ప్రైవేటు ఆసుపత్రి క్యాంటిన్‌లో పనిచేస్తోంది. ఈ నెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదు. దీంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. Also Read: దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నివేద కాల్స్‌డేటాను పరిశీలించగా ఆమె కొనవట్టంకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తేలింది. క్యాంటీన్‌లో పనికి చేరిన మొదటి రోజే ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. నివేదను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆ యువకుడు ఆమెను తీర్థగిరి కొండ ప్రాంతానికి తీసుకెళ్లి కిందికి తోసేశాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసుల నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read:
By December 19, 2019 at 11:56AM
No comments