Breaking News

తాగిన మైకంలో పోలీసులపై దాడి.. సెక్సీనటి బాబిలోనా తమ్ముడు అరెస్ట్


పోలీసులపై దాడికి పాల్పడిన ఘటనలో శృంగార తార సోదరుడు అరెస్ట్ అయ్యాడు. తమిళనాడులోని పెరంబూరు సమీపంలోని దశరథపురంలోని తొమ్మిదో వీధిలో ఓ వ్యక్తి గొడవ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించింది. దీంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్ఐ పళనిశంకర్ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లారు. Also Read: మద్యం మత్తులో రగడ చేస్తున్న వ్యక్తిని పోలీసులు సముదాయించిన పోలీసులు ఇంటికి వెళ్లాలంటూ సూచించారు. అయితే ఆ వ్యక్తి అక్కడికి వెళ్లేందుకు నిరాకరించి పోలీసులపైనే ఎదురు తిరిగాడు. వారిని దుర్భాషలాడుతూ శంకర్ అనే కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు అతడిని నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. Also Read: అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు వివరాలు ఆరా తీయగా.. ప్రముఖ శృంగార తార బాబిలోనా సోదరుడు విఘ్నే్శ్‌కుమార్‌గా గుర్తించారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అందాల ఆరబోతతో తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో సెక్సీ నటిగా పేరు తెచ్చుకున్న బాబిలోనా ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగు కుటుంబానికి చెందిన ఆమె అసలు పేరు భాగ్యలక్ష్మి. పారిశ్రామికవేత్త సుందర్ బాబుల్ రాజును ప్రేమించిన ఆమె 2015లో క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. Also Read:


By December 18, 2019 at 10:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sexy-actress-babilona-brother-arrest-over-attack-on-police-in-tamil-nadu/articleshow/72863547.cms

No comments