Breaking News

రౌడీతో ఎమోషనల్‌ డ్రామా.. క్రేజీ కాంబినేషన్‌ సెట్ చేసిన దిల్ రాజు


సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరోగా మరో సినిమా ఎనౌన్స్‌ అయ్యింది. నిన్ను కోరి, మజిలీ లాంటి ఎమోషనల్‌ డ్రామాలను తెరకెక్కించిన యువ దర్శకుడు శివా నిర్వాణ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రోజు నిర్మాత దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్యా రాజేస్‌, ఇసా బెల్లాలు హీరోయిన్లుగా నటిస్తు్న్నారు. ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా 2020 ఫిబ్రవరి 14న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ హీరో హీరోయిన్ల పోస్టర్లను రిలీజ్‌ చేశారు. Also Read: ఈ సినిమా తరువాత డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు రౌడీ. ఫైటర్‌ పేరుతో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆకాష్‌ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ నిర్మాణ పనుల్లో ఉన్న పూరి, ఆ సినిమా పూర్తయిన వెంటనే ఫైటర్‌ను సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు విజయ్‌ ఖాతాలో మరో సినిమాకూడా ఉంది. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో అనే సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్‌ పూర్తయ్యింది. అయితే అవుట్‌పుట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు. Also Read: ఇలా వరుసగా క్లాస్‌ మాస్‌ సినిమాలతో దూసుకుపోతున్న విజయ్‌ దేవరకొండ తాజాగా శివా నిర్మాణ లాంటి ఎమోషనల్‌ డ్రామాల దర్శకుడితో సినిమా చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. విజయ్‌ గీత గోవిందం లాంటి సినిమాల్లో ఎమోషనల్‌ సీన్స్‌లో కనిపించినా పూర్తి స్థాయి ఎమోషనల్‌ డ్రామా ఇంతవరకు చేయలేదు. మరి రౌడీ ఇమేజ్‌ ఉన్న విజయ్‌ ఈ తరహా పాత్రలో ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.


By December 18, 2019 at 09:56AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vijay-deverakonda-next-film-with-majili-fame-shiva-nirvana/articleshow/72863272.cms

No comments