Breaking News

ప్రియుడి కోసం హల్‌చల్‌.. బాచుపల్లి పోలీసులను తిప్పలు పెట్టిన యువతి


తన ప్రియుడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ యువతి పోలీస్‌స్టేషన్‌లో హల్‌చల్ చేసింది. మణికొండ సమీపంలోని చిత్రపురి కాలనీకి చెందిన ఓ యువతి (22)కి మాదాపూర్‌లోని ఓ సంస్థలో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న వివాహితుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో యువతి అతడితో హద్దులు దాటేసింది. మోజు తీరడంతో ఆ వ్యక్తి ఆమె నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. Also Read: దీంతో రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసముండే ప్రియుడి ఇంటికి బుధవారం రాత్రి ఆ యువతి వచ్చింది. ఆ సమయంలో అతడి తల్లిదండ్రులు మాత్రమే ఇంట్లో ఉండటంతో నానా హంగామా చేసింది. అతడితో వెంటనే తనకు పెళ్లి జరిపించాలని డిమాండ్ చేసింది. దీంతో వారు బాచుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతితో పాటు వ్యక్తి తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకెళ్లారు. Also Read: అయితే ప్రియుడితో తనకు వివాహం జరిపించాలంటూ ఆ యువతి స్టేషన్‌లోనే రచ్చ చేసింది. వస్తువులను కింద పడేయడంతో పాటు గోడను తలకేసి కొట్టుకుంది. ప్రియుడితో తనకు పెళ్లి చేయకపోవే చచ్చిపోతానంటూ రెండుసార్లు స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీసింది. చివరకు పోలీసులు పెళ్లి చేయిస్తామని హామీ ఇవ్వడంతో శాంతించింది. యువతిపై కేసు నమోదు చేసి పోలీసులు ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు. Also Read:


By December 26, 2019 at 09:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-woman-hulchul-in-bachupally-police-station/articleshow/72973969.cms

No comments