Breaking News

సమయం లైవ్ న్యూస్: రియల్ భూమ్.. తెలంగాణలో అలా.. ఏపీలో ఇలా


⍟ సుజనాకు బొత్స కౌంటర్: రాజధాని అంశంపై పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, రాజధాని అమరావతి నుంచి తరలింపు సాధ్యం కాదన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యలకు కూడా బొత్స కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చెందడానికి అనువైన నగరం విశాఖపట్నమేనని అన్నారు. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయమని మాత్రమేనని మంత్రి వ్యాఖ్యానించారు. ⍟ భూవివాదంలో వైసీపీ ఎమ్మెల్యే: హైదరాబాద్‌ శివారులోని రూ.100 కోట్ల విలువచేసే భూమి వివాదంగా మారింది. ఈ భూమి తనదంటూ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే బోర్డు పెట్టిస్తే, ఇందులో స్థలాలు తమవంటూ కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భూమి వివాదాస్పదమైంది. హైదరాబాద్‌ - విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ సమీపంలోని తుఫ్రాన్‌పేట శివారు ప్రాంతంలోని ఒకే సర్వే నంబరులో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిపై ఇరు వర్గాలూ తమదంటే తమదని వాదిస్తున్నాయి. ⍟ జగన్ పాలనపై కేటీఆర్ స్పందన: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరు నెలల పాలనపై తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో ట్విటర్ ద్వారా నెటిజన్లతో టచ్‌లో ఉండే కేటీఆర్.. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. ⍟తల్లిదండ్రులకు హరీశ్ కీలక సూచన: పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి హరీశ్ రావు కీలక సూచనలు చేశారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు విద్యార్థినీ విద్యార్థులకు రోజూ చదువుకునే వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి పనులు, వ్యవసాయ పనులు చెప్పొద్దని సూచించారు. కొన్ని రోజులు పాటు సెల్‌ఫోన్లు, టీవీలు, పెళ్లిళ్లు, విందులు, వినోదాలకు పిల్లలను దూరంగా ఉంచాలని చెప్పారు. ⍟ఏపీలో ఇలా.. తెలంగాణలో ఇలా: మూడు రాజధానుల అంశంపై ఏపీలో సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారం పుంజుకునేందుకు కారణం అవుతున్నాయని చెప్పారు. తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ రంగం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉందన్నారు.


By December 30, 2019 at 09:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-30th-december-2019/articleshow/73024311.cms

No comments