Breaking News

పిల్లనిచ్చిన అత్తతో అక్రమ సంబంధం.. భార్యకు తెలియడంతో


పిల్లనిచ్చిన అత్త వేధింపులు తాళలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచేసింది. త్రిపురాంతకం మండలం కొత్త ముడివేముల గ్రామానికి చెందిన అరిపిరాల రవిశంకర శర్మ (35) శనివారం రాత్రి కురిచేడు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి చేసుకున్నాడు. సంఘటనా స్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో అనేక కోణాలను పోలీసులు గుర్తించారు. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని తలపించే ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. Also Read: అరిపిరాల రవిశంకరశర్మ(35) త్రిపురాంతకం మండలంలోని కొత్త ముడివేముల గ్రామం. ఇతను గుంటూరులో డిగ్రీ చదివే రోజుల్లో అక్కడ గుళ్ళపల్లి మారుతి దేవి అనే వివాహితతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రవిశంకరశర్మ తల్లిదండ్రులు దోర్నాలకు చెందిన యువతితో అతనికి వివాహం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతనికి వేరే యువతితో వివాహం చేశారు. అయితే తమ సంబంధానికి ఆమె అడ్డొస్తుందంటూ వారిద్దరికీ ఆ మహిళ విడాకులు ఇప్పించింది. Also Read: కొద్దిరోజులకే మంచి సంబంధమని తన కూతురిని నమ్మించి అతడికిచ్చి పెళ్లి చేసింది. వారికి ముగ్గురు సంతానం కలిగిన తర్వాత మారుతి దేవి అల్లుడిని పట్టించుకోకుండా సముద్రాల రామాచారి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని హైదరాబాదుకు మకాం మార్చింది. అత్త దూరం కావడంతో రవిశంకరశర్మ మనస్తాపానికి గురై భార్యా పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. ఈ క్రమంలోనే తన భర్తకు తల్లితో ఉన్న అక్రమ సంబంధం గురించి అతడి భార్యకు తెలిసింది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. Also Read: కుటుంబ కలహాలతో విసిగిపోయిన రవిశంకరశర్మ శనివారం రాత్రి కురిచేడు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం రాత్రి పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుడి చొక్కా జేబులో లభించిన లేఖ ఆధారంగా వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్ల పోలీసులు తెలిపారు. Also Read:


By December 30, 2019 at 08:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/prakasam-district-man-commits-suicide-over-illegal-affair-with-mother-in-law/articleshow/73024236.cms

No comments