బావమరిదిని చంపే బావిలో పడేసిన బావ.. మెదక్ జిల్లాలో దారుణహత్య

భార్య అన్నను అత్యంత దారుణంగా చంపేసి బావిలో పడేశాడో కిరాతకుడు. జిల్లా భిక్కనూరు మండలం బాగిర్తిపల్లికి చెందిన పావన్నగారి శేఖర్(23) శుక్రవారం జిల్లా రామాయంపేట శివారులోని బావిలో శవమై కనిపించాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి వివరాలు ఆరా తీయగా హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి చెల్లి భర్త పోతుల శేఖర్ మరో ఇద్దరితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. Also Read: ఈ విషయం తెలియడంతో రెచ్చిపోయిన బాగిర్తిపల్లి గ్రామస్థులు పోతుల శేఖర్‌కు చెందిన రెండిళ్లను ధ్వంసం చేశారు. దీంతో భయపడిన నిందితుడు లొంగిపోయాడు. అతడిచ్చిన సమాచారంతో మరో నిందితుడు భిక్షపతిని అరెస్ట్ చేశారు. ఈ హత్యతో ప్రమేయముందన్న అనుమానంతో గ్రామస్థులు స్వామి అనే మరో వ్యక్తి ఇంటిపై దాడి చేశారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భిక్కనూరు, కామారెడ్డి పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఆర్‌పీఎఫ్ పోలీసులు మోహరించారు. Also Read: మరోవైపు గ్రామంలోకి ప్రధాన రహదారిపై చేరుకున్న స్థానికులు నిందితులను తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ హత్యలో ఇంకా ఎవరెవరున్నారో నిజాలు తేల్చాలన్నారు. నిందితులకు శిక్ష పడేంతవరకు శేఖర్ మృతదేహానికి అంత్యక్రియలు జరపబోమని కుటుంబసభ్యులు, గ్రామస్థులు భీష్మించుకుని కూర్చున్నారు. ఈ ఘటనపై కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. Also Read:
By December 29, 2019 at 09:45AM
No comments