Breaking News

‘నా కూతురిని ఏడాదిగా రేప్ చేస్తూ.. రెడ్‌లైట్ ఏరియాకు అమ్మేస్తామంటున్నారు’


‘నా కూతురిని ముగ్గురు ఎత్తుకెళ్లి ఏడాదిగా అత్యాచారం చేస్తున్నారు. దుబాయ్‌ షేక్‌లకు, రెడ్‌ లైట్‌ ఏరియాకు అమ్మేస్తామంటూ బెదిరింపు కాల్స్‌ చేస్తున్నారు’ అంటూ ఓ తండ్రి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. బాధిత బాలిక తండ్రి ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌ మండలం బీరంగూడలో ఉంటున్నాడు. గతంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేట బాపూజీనగర్‌లో ఉండగా, ఆయన మూడో సంతానమైన బాలిక(14)ను పొరుగింట్లో ఉండే గజేంద్ర (24) ప్రేమ పేరుతో లొంగదీసుకుని ఏడాది పాటు అత్యాచారం చేశాడు. Also Read: దీనిపై ఆమె కుటుంబం నిలదీయగా బాలికను తనకిచ్చి పెళ్లి చేసి, కుటుంబమంతా ఊరు విడిచి వెళ్లిపోవాలని బెదిరించాడు. దీంతో బాలిక కుటుంబం సంగారెడ్డి జిల్లాకు వలసపోయింది. అక్కడికి చేరుకున్న ఆ కామాంధుడు గజేంద్ర బాలికను కిడ్నాప్ చేశాడు. దీంతో పోలీసులు గజేంద్రపై రేప్‌, కిడ్నాప్‌ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. కొద్దిరోజులకు బెయిల్‌పై విడుదలైన గజేంద్ర మరోసారి బాలికను ఎత్తుకెళ్లి ధర్మసాగర్‌ మండలం సాయిపేటకు చెందిన దిలీప్‌కుమార్‌ ఇంట్లో దాచాడు. Also Read: ఈ క్రమంలో తన కూతురిపై వారిద్దరూ అత్యాచారానికి పాల్పడ్డారని, కరుణాకర్ అనే బ్రోకర్ సాయంతో దిలీప్‌కుమార్‌ ఆమెను పెళ్లి చేసుకున్నాడని బాలిక తండ్రి కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తుతెలియని నంబర్‌ నుంచి ఎవరో ఫోన్‌ చేసి కేసు రాజీ చేసుకోకపోతే మీ కూతురుని దుబాయ్‌ షేక్‌లకు, ముంబై రెడ్‌లైట్‌ ఏరియాకు అమ్మేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొనాడు. దీనిపై విచారణ చేపట్టిన కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్‌ ఫిర్యాదు వాస్తమేనని తేల్చారు. గతంలోనూ కూతురు కనపడడం లేదంటూ ఆయన కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ మధ్యే కాజీపేట పోలీసులు బాలికను వెతికి పట్టుకొని కోర్టులో పరచగా.. ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు నిరాకరించి దిలీప్‌కుమార్‌తో వెళ్లిపోయినట్లు తమ రికార్డుల్లో ఉందన్నారు. Also Read:


By December 29, 2019 at 10:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-man-gives-complaint-to-kazipat-police-over-his-daughter-kidnap-rape-issue/articleshow/73014371.cms

No comments