Breaking News

మధ్యప్రదేశ్‌లో మరో నిర్భయ.. కదులుతున్న బస్సులోనే బాలికపై గ్యాంగ్ రేప్


మధ్యప్రదేశ్‌లోని దారుణ ఘటన జరిగింది. రాత్రి వేళ కుటుంబంపై అలిగిన ఓ బాలిక అన్నను కలిసేందుకు ఒంటరిగా వెళ్తున్న బాలికను అపహరించిన ముగ్గురు వ్యక్తులు బస్సులోనే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాజ్‌గంజ్ జిల్లాలోని సుతాలియా ప్రాంతానికి చెందిన బాలిక గురువారం తల్లిదండ్రులతో గొడవ పడిన ఇండోర్‌లో ఉండే తన అన్న దగ్గరికి బయలుదేరింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న బాలికను బస్సు క్లీనర్ రాజు అహిర్వర్(22) పలకరించాడు. ఎక్కడికి వెళ్తున్నావంటూ ఆమె నుంచి వివరాలు తెలుసుకుని ఫోన్ నంబర్ తీసుకున్నాడు. Also Read: వెంటనే ఈ విషయాన్న తన ఇద్దరు స్నేహితులకు చేరవేయడంతో క్షణాల్లో వారు అక్కడికి చేరుకున్నారు. బస్సులో తీసుకెళ్తామంటూ నమ్మించి ఆమెను బస్సు ఎక్కించారు. కాస్త దూరం వెళ్లాక ఓ యువకుడు బస్సు నడపగా.. మరో ఇద్దరు ఆమెను నిర్బంధించి నోట్లో గుడ్డలు కుక్కి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: మరోవైపు బాలిక ఆచూకీ లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు సుతాలియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం నగరంలో గాలించగా ఓ చోట కనిపించింది. దీంతో ఆమెను స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించగా తనపై గ్యాంగ్ రేప్ జరిగనట్లు తెలిపింది. దీంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి ఐపీసీ 363, 366, 376 (2) సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. Also Read:


By December 29, 2019 at 12:01PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/minor-girl-gang-raped-in-mobing-bus-in-madhya-pradesh/articleshow/73015114.cms

No comments