Breaking News

12 ఏళ్ల బాలికకు పోర్న్ వీడియో చూపించిన కామాంధుడు


మైనర్ బాలికకు చూపించి లైంగిక వేధింపులకు పాల్పడిన కామాంధుడికి న్యాయస్థానం మూడు నెలల జైలుశిక్ష విధించింది. పశ్చిమ ప్రాంతంలోని అంధేరిలో ఓ వ్యక్తి న్యూస్‌పేపర్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. 2015 సంవత్సరంలో ఓ రోజు తండ్రికి సాయం చేసేందుకు ఇద్దరమ్మాయిలు దుకాణానికి వెళ్లారు. Also Read: కొద్దిసేపటి తర్వాత దుకాణం యజమాని ఓ పని నిమిత్తం పెద్ద కుమార్తెను తీసుకుని బయటకు వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన అమర్జిత్ కుమార్ కనోజియా అనే వ్యక్తి బాలికతో మాటలు కలిపాడు. తాను కొత్తగా కొనుగోలు చేసి సెల్‌ఫోన్లో వీడియోలు చూపిస్తానంటూ పోర్న్ వీడియోలు ఆమెకు చూపించాడు. ఆ సమయంలో బాలిక జననాంగాలు తడుముతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బెదిరిపోయిన బాలిక దుకాణం నుంచి బయటకు పరుగులు తీసింది. Also Read: కాసేపటి తర్వాత తిరిగొచ్చిన తండ్రికి జరిగిన విషయం చెప్పడంతో అతడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం కనోజియా దోషిగా నిర్ధారించి మూడు నెలల జైలుశిక్ష విధించింది. Also Read:


By December 29, 2019 at 11:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-sentenced-to-3-month-imprisonment-for-showing-porn-video-to-minor-girl-in-mumbai/articleshow/73014830.cms

No comments