Breaking News

సమయం లైవ్ న్యూస్: ఆనం వ్యాఖ్యలపై జగన్ సీరియస్.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు


⍟ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు: పెళ్లికాని జంట ఒకే గదిలో ఉండటం నేరంగా పరిగణించలేమని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇటీవల కోయంబత్తూరులోని ఓ లాడ్జిపై రైడింగ్ చేసిన పోలీసులు.. ఓ గదిలో పెళ్లికాని జంట, మరో గదిలో మద్యం సీసాలును గుర్తించారు. దీంతో ఆ లాడ్జిని అధికారులు సీజ్ చేశారు. అధికారుల చర్యలను సవాల్ చేస్తూ లాజ్జి యాజమాన్యం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ⍟ ఎన్‌కౌంటర్.. పోలీసులపై కేసు: దిశ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఒంటరిగా ఉన్న అమ్మాయిని ట్రాప్ చేసి అత్యంత కిరాతకంగా అఘాయిత్యానికి ఒడిగట్టిన రాక్షసులను ఉరి తీయాలని, ఎన్‌కౌంటర్ చేసి చంపాలని డిమాండ్ చేశారు. అందరూ ఆశించనట్లే జరిగింది. దిశను దారుణంగా చంపిన 10 రోజుల్లోపే ఆ మృగాళ్లు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.రాక్షసులను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపితే.. పోలీసులపై కేసులు వేయడం చాలా మందిని విస్మయానికి గురిచేస్తోంది. ⍟ ఏకమైన దొంగ పోలీస్: ఓ జేబుదొంగ.. పోలీస్ జోడీ కట్టారు. ఇంకేముంది ప్రజలను దోచుకోవడానికి తెగబడ్డారు. దుకాణదారుల నుంచి రౌడీల మాదిరిగా మామూళ్లు వసూలు చేశారు. ఉన్నతాధికారులకు వాటాలివ్వాలంటూ అందికాడికి దోపిడీకి పాల్పడ్డారు. తీరా విషయం బయటికి పొక్కడంతో కటకటాల వెనక్కి చేరిన ఘటన గుంటూరు జిల్లా ఉండవల్లిలో కలకలం రేపింది. ⍟ కేంద్రానికి కేసీఆర్ లేఖ: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటాను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ముఖ్యమంత్రి కోరారు. ఈ మేరకు శనివారం (డిసెంబర్ 7) ఓ లేఖ రాశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి జీఎస్టీ తదితర పన్నుల వాటా మొత్తం రూ.4531 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. ⍟ ఆనం వ్యాఖ్యలపై జగన్ సీరియస్: మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలతో దుమారం రేగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వ్యాఖ్యానించడంపై సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు. అయితే, ఆనం వ్యాఖ్యలను అధినేత సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.


By December 08, 2019 at 08:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-8th-december-2019/articleshow/72421951.cms

No comments