బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ ఇంజినీరింగ్ విద్యా్ర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన శ్రీవాస్తవ సోమవారం శంషాబాద్‌లోని ఓయో హోటల్‌లో రూమ్ నంబర్ 106లో దిగాడు. తర్వాత బయటికి వెళ్లిన అతడు రాత్రి 1.30 గంటల సమయంలో రూమ్‌కి వచ్చాడు. హోటల్ సిబ్బంది మంగళవారం తలుపుకొట్టగా ఎంతసేపటికీ తీయలేదు. దీంతో వారు తలుపు పగులగొట్టి లోనికి వెళ్లి చూడా అతడు మంచంపై పడి ఉన్నాడు. Also Read: అదే సమయంలో శ్రీవాస్తవ సెల్‌ఫోన్‌కు కాల్ రావడంతో సిబ్బంది మాట్లాడారు. అవతలి నుంచి తాము పోలీసులమని, శ్రీవాస్తవ కనిపించకుండా పోవడంతో అతడి కోసం వెతుకుతున్నామని చెప్పారు. శ్రీవాస్తవ ఆత్మహత్య చేసుకున్నట్లు హోటల్ సిబ్బంది చెప్పడంతో బెంగళూరు పోలీసులు శంషాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో క్షణాల్లో వారు హోటల్‌కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. Also Read: శ్రీవాస్తవ వాటర్‌లో విషయం కలుపుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే శ్రీవాస్తవ ఆత్మహత్య చేసుకోవడానికి బెంగళూరు నుంచి ఎందుకు వచ్చాడన్నది సస్పెన్స్‌గా మారింది. ఆత్మహత్య విషయం అతడి తల్లిదండ్రులకు చేరవేసిన పోలీసులు దీనికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. Also Read:
By December 24, 2019 at 01:36PM
No comments