Breaking News

అమరావతిలో కాల్‌మనీ కలకలం.. పీఎస్ ఎదుటే పురుగులమందు తాగిన యువకుడు


ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కలకలం రేపిన వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. అమరావతిలోని తాడేపల్లిలో కాల్‌మనీ వ్యాపారుల వేధింపులు తాళలేక వెంకట్ అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. Also Read: కాల్‌మనీ వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ఆదివారం తాడేపల్లి పోలీస్‌స్టేసన్‌కు వచ్చిన వెంకట్ పీఎస్ ఎదుటే పరుగులమందు తాగాడు. కొద్దిరోజులుగా వడ్డీ వ్యాపారులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఆత్మహత్యకు యత్నించిన వెంకట‌ను పోలీసులు కాపాడి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. Also Read: ఇటీవల కాలంలో పరిధిలో కాల‌మనీ వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన ప్రభుత్వోద్యోగిని కాల్‌మనీ వ్యాపారులు వేధిస్తున్నారంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసింది. వడ్డీతో సహా అసలు మొత్తం తీర్చేసినా వ్యాపారులు తన డెబిట్ కార్డు, చెక్కులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, తనకొచ్చే జీతాన్ని వారే తీసుకుంటున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి వేధింపులు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఆ ఘటన మరువకముందే అమరావతిలోనే మరో ఘటన జరగడం కలకలం రేపింది. Also Read:


By December 15, 2019 at 01:17PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/call-money-harassment-young-man-suicide-attempt-in-amaravati/articleshow/72667562.cms

No comments