Breaking News

విద్యార్థులతో అభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. హెడ్మాస్టర్‌పై తల్లిదండ్రుల దాడి


తమ పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, పాఠశాలలోనే ఉపాధ్యాయురాలితో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ ప్రధానోపాధ్యాయుడు మాకొద్దంటూ నినాదాలు చేశారు. ఈ ఘటన జిల్లా తిరుపతిలో చోటు చేసుకుంది. Also Read: నగర పరిధి సత్యనారాయణపురంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు సోమవారం ఉదయం విద్యార్థులు, తల్లిదండ్రులు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు రవీంద్రయ్యపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విద్యార్థినులతో హెడ్మాస్టర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నారు. అలాగే పాఠశాలలో తనతో పాటే పనిచేసే ఉపాధ్యాయురాలుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. అయితే నిజనిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయవద్దని, తనపై కోపంతో కొందరు ఉపాధ్యాయలు, విద్యార్థులు కలిసి ఇలా కుట్ర పన్నారని ప్రధానోపాధ్యాయుడు పేర్కొన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనపై దాడికి దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను రక్షించారు. Also Read:


By December 24, 2019 at 10:46AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tirupati-school-students-parents-attacked-to-headmaster/articleshow/72949238.cms

No comments